»Bollywood Heroine Manisha Koirala Met British Prime Minister Rishi Sunak
Manisha Koirala: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలిసిన బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాల
బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో కలిసి తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రిషి సునాక్‌ను కలిసిన సందర్భాన్ని నటీ మనీషా కొయిరాలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Bollywood heroine Manisha Koirala met British Prime Minister Rishi Sunak
Manisha Koirala: బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాల(Manisha Koirala) బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో కలిసి తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రిషి సునాక్‌ను కలిసిన సందర్భాన్ని నటీ మనీషా కొయిరాలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. యూనైటెడ్ కింగ్డమ్, నేపాల్ ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ దౌత్య సంబంధాలు 100 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా యూకోలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనీషా కొయిరాల హజరయ్యారు. ప్రధాని నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం చాలా సంతోషకరమని, ప్రధాని రిషి సునాక్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. అంతే కాదు ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని.. ఆయన కుటుంబాన్ని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు ట్రెక్కింగ్ రావాలని కోరినట్లు మనీషా కొయిరాల చెప్పుకొచ్చారు. అంతే కాదు అక్కడున్న చాలా మంది అతిథులు హీరామండి వెబ్ సిరీస్ చూశామని చెప్పడం చాలా నచ్చిందని మనీషా తెలిపింది.
బాలీవుడ్లో వరుస సినిమాలతో అలరించిన ఈ బ్యూటీకి రాజకీయ నేపథ్య కుటుంబం ఉందన్న విషయం తెలిసిందే. మనీషా తండ్రి ప్రకాష్ కొయిరాల, ఆమె తాతా బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా ఇద్దరికి రాజకీయ నేపథ్యం ఉంది. బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాల 1959లో నేపాల్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత మనీషా తండ్రి నేపాల్‌లో యాక్టీవ్ పొలిటీషన్‌గా ఉన్నారు. దశాబ్దం క్రితం వరకు మనీషా కొయిరాల బిజీ యాక్టర్‌గా ఉంది. ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుంది. తాజాగా సంజయ్ లీలీ భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన హీరామండి వెబ్ సిరీస్‌లో ఆమె కనిపించారు. తన అద్భతమైన నటనకు ప్రేక్షకులు అందరూ ఫిదా అయ్యారు.