»Another Heroine In Bharatiyadu 2 Is Manisha Koirala
Bharatiyadu 2: ‘భారతీయుడు 2’లో మరో హీరోయిన్?
స్టార్ క్యాస్టింగ్‌తో స్టార్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా రీ ఎంట్రీ ఇచ్చింది ఈ సీనియర్ బ్యూటీ.
Another heroine in Bharatiyadu 2 is Manisha Koirala
Bharatiyadu 2: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ మూవీ ‘ఇండియన్ 2’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన.. కొన్ని కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయింది. కానీ విక్రమ్ సినిమా హిట్ జోష్‌లో మళ్లీ ఈ సినిమాను లైన్లో పెట్టాడు కమల్ హాషన్. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది ఇండియన్ 2. ముందుగా మేకర్స్ జూన్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ జూన్ 27న ప్రభాస్ కల్కి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. జూలైలో ఇండియన్ 2 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జూలై 12న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలకు మంచి స్పందన వస్తోంది. కాకపోతే భారతీయుడు పాటలతో పోలిస్తే.. అనిరుధ్ ఆ రేంజ్ సాంగ్స్ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా వంటి తదితరులు నటిస్తున్నారు. అయితే.. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం సీనియర్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా డైరెక్టర్ శంకర్‌తో మనీషా దిగిన ఫొటో వైరల్ కావడంతో.. ఆమె కూడా అతిథి పాత్రలో నటించిందని టాక్ కోలీవుడ్ వర్గాల సమాచారం. మనీషా ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో నటించింది. హీరామండి 2లో కూడా నటిస్తోంది. ఇక ఇప్పుడు ఇండియన్ 2లోను నటిస్తోంది. అన్నట్టు.. భారతీయుడు సినిమాలో యంగ్ కమల్ హాసన్ సరసన హీరోయిన్గా నటించింది మనీషా.