నిజమే.. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతుంటే, ఇప్పుడు శంకర్ కూడా భయపెట్టేశాడు. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారు. మరి ఎందుకలా భయపడుతున్నారంటే?
NTR-Ram Charan: Rajamouli, Shankar scaring NTR, Ram Charan? Fan tension!
NTR-Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్, తారక్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ కొట్టేసి సంచలనంగా నిలిచింది. కానీ.. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్, తారక్ చేస్తున్న సినిమాల విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే.. రాజమౌళి కెరీర్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే.. ఆయనతో సినిమా చేసిన ఏ హీరో అయినా సరే, నెక్స్ట్ సినిమాతో ఫ్లాప్ చూడాల్సిందే.
ఇప్పుడు ఈ సెంటిమెంట్‌ను దేవరతో ఎన్టీఆర్, గేమ్ చేంజర్‌తో చరణ్ బ్రేక్ చేస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో మరింత భయపెట్టేశాడు శంకర్. భారతీయుడు 2కి శంకర్ దర్శకుడుగా కాగా.. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఈ ఇద్దరు కూడా భారతీయుడుతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. శంకర్ మార్క్ మిస్ అవడంతో పాటు.. అనిరుధ్ బీజిఎం కూడా చాలా వీక్‌గా ఉంది. దీంతో.. గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందోనని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పైగా ఈ సినిమాను మూడేళ్లుగా చెక్కుతునే ఉన్నాడు శంకర్.
ఇక అనిరుధ్ మ్యూజిక్ పై భారీ ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. దేవరకు ఎలాంటి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తాడోనని.. భయపడుతున్నారు. పైగా ఫియర్ సాంగ్ మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాబట్టి.. అటు శంకర్ గేమ్ ఛేంజర్‌కు, ఇటు అనిరుధ్ దేవరకు ది బెస్ట్ ఇచ్చి తీరాల్సాందే. ఎందుకంటే.. RRR లాంటి భారీ విజయం తర్వాత రాబోతున్నఈ టాప్ హీరోలకు ఈ రెండు సినిమాలు చాల కీలకం. మరి దేవర, గేమ్ ఛేంజర్ ఏం చేస్తాయో చూడాలి.