»Kalki 2898 Ad Shahrukh Breaks Record With Kalki Karnadu Looks Amazing
Kalki 2898 AD: ‘కల్కి’తో షారుఖ్ రికార్డ్ బద్దలు.. కర్ణుడు లుక్ అదిరింది!
'కల్కి 2898 AD' మూవీ రెండు వారాలు కంప్లీట్ చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు 2024లో అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది కల్కి. అంతేకాదు.. రిలీజ్ అయిన రోజు నుంచి ప్రతిరోజూ కొత్త రికార్డులను బద్దలు కొడుతోంది.
Kalki 2898 AD: తాజాగా ‘కల్కి 2898 ఏడి’ వెయ్యి కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది. ఈ సందర్భంగా.. ప్రభాస్ కర్ణుడు పోస్టర్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూసిన తర్వాత.. కర్ణుడు కూడా ఇలాగే ఉంటాడా? అనేలా ఉన్నాడు రెబల్ స్టార్. ఇక కల్కి.. 543 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టి.. షారుఖ్ రికార్డ్ బద్దలు కొట్టింది. మొదటి వారంలో 414 కోట్లు, రెండవ వారంలో 128 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి.. మొత్తం 15 రోజులలో 543 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దీంతో.. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ లైఫ్ టైం కలెక్షన్స్‌ను బీట్ చేసింది కల్కి.
పఠాన్ మూవీ 543 కోట్ల నెట్.. 1050 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు కల్కి పఠాన్‌ను క్రాస్ చేసి జవాన్ రికార్డ్ బ్రేక్ చేయడమే టార్గెట్‌గా పరుగులు పెడుతోంది. జవాన్ సినిమా మొత్తం 1148 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం కల్కికి థియేటర్లో తిరుగు లేకుండా ఉంది. లేటెస్ట్గా రిలీజ్ అయిన ‘భారతీయుడు 2’కి డివైడ్ టాక్ రావడంతో.. ఇప్పట్లో కల్కి హవా తగ్గేలా లేదు. కాబట్టి.. జవాన్ రికార్డ్ కల్కి ఖచ్చితంగా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్ రాబట్టిన చిత్రాల టాప్ 5 లిస్ట్‌లో కల్కి నిలవనుంది.
అలాగే.. టాప్ 5లో రెండు సినిమాలున్న రికార్డ్ కూడా ప్రభాస్‌దే. ఇప్పటికే బాహుబలి 2 సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. ఆర్ఆర్ఆర్, కెజియఫ్ మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు కల్కి ఐదో స్థానంలో నిలిచేలా ఉంది. ఆ తర్వాత ఆరు, ఏడు స్థానాల్లో జవాన్, పఠాన్ సినిమాలు నిలవనున్నాయి. కల్కితో కలిపి ఇప్పటి వరకు మొత్తంగా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు రాబట్టిన సినిమాలు ఏడు అయ్యాయి. అన్నట్టు.. ఇందులో రాజమౌళివే రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉండడం విశేషం.