BDK: ప్రైవేటు పాఠశాల స్కూల్ బస్సు, ఆటో డ్రైవర్లకు పట్టణ ఎస్సైలు స్వప్ప, శ్యామ్ శుక్రవారం ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్టులు నిర్వహించారు. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా భద్రాచలం పట్టణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పారు. డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు.