AKP: రబీ సీజన్లో రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని జిల్లా వనరుల కేంద్రం ఏడీఆర్ శ్రీధర్ సూచించారు. అనకాపల్లి గవరపాలెం రైతు సేవా కేంద్రంలో శుక్రవారం వ్యవసాయ సిబ్బందికి శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఆదాయం పెరిగే విధంగా కృషి చేయాలన్నారు. ఏడీ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రైతు సంక్షేమ పథకాలపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.