TG: శాసనసభలో ఇవాళ ప్రభుత్వం నాలుగు కీలక సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. పబ్లిక్ సర్వీసెస్ నియామకాల క్రమబద్ధీకరణ బిల్లు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, సిబ్బంది హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణానికి సంబంధించిన సవరణ బిల్లు-2026, దాని రెండో సవరణ బిల్లులను (బిల్లు నెం.7), పంచాయతీ రాజ్ చట్టానికి సంబంధించి రెండు కీలక సవరణ బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు.