సేవ్ చేయని నంబర్ కాల్స్ వస్తే ఇకపై టెన్షన్ వద్దు. ట్రాయ్ తెస్తున్న ‘CNAP’ ఫీచర్‌తో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినా పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. మార్చి 31 కల్లా ఇది అమల్లోకి రానుంది. సిమ్ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా పేర్లు డిస్ప్లే అవుతాయి. దీంతో స్పామ్ కాల్స్‌ను ఈజీగా పసిగట్టవచ్చు. ఈ ఫీచర్ వస్తే ట్రూకాలర్ వంటి యాప్స్ అవసరం ఉండదు.