NLG: నిడమనూరు మండలం తుమ్మడం గ్రామపంచాయతి కార్యలయంలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బుర్రి వెంకటేశ్వర్లు యాదవ్ హాజరై సావిత్రి బాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన సావిత్రిబాయి పూలే, స్త్రీ విద్య కోసం కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలొ గ్రామప్రజలు పాల్గొన్నారు.