AP: తెలుగు కేవలం భాష కాదు.. మన జీవన విధానమని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. పిల్లల కోసం ఇప్పుడు తల్లులు చందమామ పాటలు పాడట్లేదని, సెల్ఫోన్ ఇచ్చి అన్నం తినిపిస్తున్నారని చెప్పారు. తెలుగు విశిష్టతను పిల్లలకు చెప్పాలని, పల్లెల్లో కూడా తెలుగు కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్రాంతి, ఉగాది తదితర పండగలకు పునర్వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.