TG: అసెంబ్లీని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎల్లుండికి వాయిదా వేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం కీలక తీర్మానాలు చేసింది. పాలమూరుకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం చేసింది. గోదావరి జలాల తరలింపునకు ఏపీకి కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అసెంబ్లీలో రేవంత్ సుదీర్ఘంగా రెండు గంటలపాటు మాట్లాడారు.