MDK: పెద్దశంకరంపేట మండల ప్రజలు సంక్రాతి పండగ సమయంలో విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఏఈ శ్యామ్ సుందర్ తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, స్తంభాల నుంచి దూరంగా ఉండాలని ప్రజలు పిల్లలకు స్పష్టంగా చెప్పాలన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా విద్యుత్ లైన్లు ఇనుప పైపులు కానీ తాకకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.