HNK: ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని సర్పంచ్ ఉస్మాన్ అలీ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా విద్య ప్రాధాన్యతపై మాట్లాడుతూ.. మహిళా విద్యకు బాటలు వేసిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. సమాజ అభివృద్ధికి విద్యే మూలమని, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.