కామారెడ్డిలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణాన్ని జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్శకుల పార్కింగ్ స్థలం, ప్రధాన ద్వారం, ఉద్యానవనం తదితర ప్రాంతాలను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పచ్చదనం సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ ఆవరణ శుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు.