NGKL: ఆల్ ఇండియా బంజారా సంఘ్ (AIBSS) అచ్చంపేట అసెంబ్లీ ఇంఛార్జ్‌గా మూడోసారి శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ బంజారాల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతానని తెలిపారు. కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రందాస్ నాయక్, జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ పాల్గొన్నారు.