కృష్ణా: పెనమలూరు(M) పోరంకి BJR నగర్లో రూ.23.95 లక్షలతో ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా MLA బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ పాఠశాల భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. జిల్లా TDP అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు.