మహబూబ్నగర్ కార్పొరేషన్, జిల్లాలోని మున్సిపాలిటీల వారిగా ఈనెల 1వ తేదీన ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితాలో ఉన్న అభ్యంతరాలని పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. మహబూబ్నగర్లో 144, భూత్పూర్లో 88, దేవరకద్ర మున్సిపాలిటీలో తొమ్మిది అభ్యంతరాలు వచ్చాయన్నారు.