MBNR: ఉదండాపూర్ రిజర్వాయర్ ఆర్అండ్ఆర్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. ఈ విషయమై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంకా పరిహారం అందని రైతుల విషయంలో కొన్ని వ్యాపారమైన చిక్కులు ఉన్నాయని, సమస్యలను త్వరగా పరిష్కరించి పనులు ప్రారంభించాలని అన్నారు.