WGL: పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివని 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ కుమార్ జోషి అన్నారు. 13వ డివిజన్లో కార్మికుల హాజరు పట్టికను ఇవాళ కార్పొరేటర్ పరిశీలించారు. నిత్యం డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు కష్టపడి పని చేస్తారని, కార్మికులు సమయ పాలన పాటించాలని కార్పొరేటర్ అన్నారు. సానిటర్ ఇన్స్పెక్టర్ భీమయ్య, తదితరులు ఉన్నారు.