AP: కోనసీమ జిల్లా ఇరసుమండలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు మూడో రోజూ కొనసాగుతుండగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు ONGC సిబ్బందితో పాటు ఢిల్లీ, ముంబై స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. బావిలోకి రసాయనాలతో కూడిన బురదను పంపి మంటల తీవ్రతను కొంతమేర తగ్గించారు. దీంతో అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా.. పునరావాసాల నుంచి గ్రామస్థులు గ్రామానికి చేరుకుంటున్నారు.