KDP: మైలవరం మండలంలో మంగళవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వద్దిరాలలో దేవ (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అలాగే దొమ్మర నంద్యాలకు చెందిన షేక్ నూర్జహాన్ (20) అనే వివాహిత కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.