ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజాసాబ్’ ఈనెల 9న విడుదల కానుంది. తాజాగా మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో తనకు, ప్రభాస్‌కు మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయని తెలిపింది. తన సోలో సీన్ ఒకదాన్ని మూడు రోజులు పెద్ద స్విమ్మింగ్‌పూల్‌లో షూట్ చేశారని చెప్పింది. తనమీద మొసలి దాడి చేస్తున్నట్లు నటించాల్సిన సీన్ ఉందని చెప్పుకొచ్చింది.