ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ఇవాళ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను ఎమ్మెల్యే KR నాగరాజ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నిరకాల వసతులు కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు తదితరులు పాల్గొన్నారు.