యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఇండస్ట్రీకి వస్తాను అని చెప్పగానే.. సోషల్ మీడియాను తట్టుకోగలవా? అని అమ్మ అడిగింది. అన్నిటినీ ఎదుర్కోగలనని చెప్పా. నా మొదటి సినిమా విడుదలైనప్పుడు ట్రోల్ చేశారు. నా నటన గురించి కాకుండా లుక్స్ గురించి మాట్లాడారు. వాటని ఎదుర్కొనే ధైర్యం అమ్మే ఇచ్చింది. ఆ విషయంలో నా తల్లికి దండం పెట్టొచ్చు’ అని చెప్పుకొచ్చాడు.