AKP: ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని అచ్యుతాపురం సీపీఎం మండల కన్వీనర్ ఆర్ రాము డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మడుతూరు, తిమ్మరాజుపేట, పెదపాడు గ్రామ సచివాలయాల్లో కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ పథకానికి పేరు మార్చడం వల్ల కూలీలకు ఉపయోగం లేదన్నారు. ఏడాదికి 200 రోజుల పని దినాలు కల్పించాలన్నారు.