KMM: ఖమ్మం నగరంలోని ఇల్లందు రోడ్డులో తుది దశకు చేరుకున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణ పనులను మంగళవారం మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవనంలోని గదులు, మౌలిక వసతుల నాణ్యతను తనిఖీ చేసిన వారు, మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.