BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మంగళవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.5.75లక్షలు, లీజులతో రూ.3.48 లక్షలు, కార్ పార్కింగ్ రూ.1.98 లక్షలు, VIP దర్శనాలతో రూ.1.50 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.1.22 లక్షలు, ప్రధాన బుకింగ్ రూ.80వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.16,66,122 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.