చిత్తూరులో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని వన్ టౌన్ సీఐ మహేశ్వర్ మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు నల్లటి కవర్ తో అనుమానంగా వెళ్తుండగా.. గుర్తించి వారిపై దాడులు నిర్వహించారు. కవర్ను ఓపెన్ చేయగా 1.1 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితులు SR.పురానికి చెందిన హరిబాబు, పవన్ కళ్యాణ్గా గుర్తించినట్లు సీఐ పేర్కొన్నారు.