E.G: కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో పదిమంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనతో వంతెనపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.