ATP: యాడికి మండలంలో వ్యవసాయ పొలాల వద్ద బోరు బావుల విద్యుత్ కేబుల్ వైర్లు వరుస చోరీలకు గురవుతుండడంతో రైతన్నలు బెంబేలెత్తిపోతున్నారు. మండల పరిధిలోని పెద్ద పేట గ్రామంలో రాత్రి వ్యవసాయ పొలాల్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి కేబుల్ వైర్లను కత్తిరించి దోచుకెళ్లారు. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.