ASF: జిల్లా పరిధిలో చైనా మాంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా నితిక పంత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.