MDK: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సర్వీసులతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 503 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ తెలిపారు. రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.