మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ తొలి రౌండ్లో ముందంజ వేశాడు. సింగపూర్‌కు చెందిన జియా హోంగ్ జాసన్ టెహ్‌పై 21-16, 15-21, 21-14 తేడాతో అద్భుత విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. ఒలింపిక్ కాంస్య పతక విజేత లీ జి జియాకు షాకిస్తూ.. 21-12, 21-17 తేడాతో విజయం సాధించాడు.