అనంతపురం మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈనెల 8న జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఛైర్మన్ బల్లా పల్లవి, వైస్ ఛైర్మన్ అర్షదుల్లా.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను ఆహ్వానించారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, మార్కెట్ యార్డును రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని సూచించారు.