విశాఖ ఇందిరా గాంధీ జూలో సంరక్షణ–బ్రీడింగ్ కార్యక్రమాల ఫలితంగా 14 వన్యప్రాణులు జన్మించాయి. కృత్రిమ ఇన్క్యూబేటర్లలో 6 ఈము పిల్లలు, 1 బ్లాక్ స్వాన్ పుట్టగా, 2 సాంబార్ జింకలు, 2 నిలగాయిలు, 3 బ్లాక్ బక్ జింక పిల్లలు జన్మించాయి. అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని జూ క్యూరేటర్ జె.మంగమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.