GNTR: ఆడబిడ్డలను పుట్టనివ్వాలని, స్వేచ్ఛగా ఎదగనివ్వాలని గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ చైల్డ్ రైట్స్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిస్టర్ విద్యా అన్నారు. తాడేపల్లి పరిధి గుండిమెడలో సరోజిని నాయుడు బాలల పార్లమెంట్ గ్రూప్లో శనివారం బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై అవగాహన కల్పించారు. దేశంలో 53.22% మంది బాలలు లైంగిక అత్యాచారాలకు గురౌతున్నారని ఆమె అన్నారు.