NDL: గడివేముల గ్రామానికి చెందిన మేఘాల వినోద్ కుమార్ అదృశ్యమైన కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫోన్లో పరిచయమైన బాలికను వేధించడంతో ఆగ్రహించి అతడిని కొట్టి గాలేరు–నగరి కాల్వలో పడేశారని సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.