VKB: పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా శాఖ మంగళవారం ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్‌లో విద్యార్థుల దాగిన ప్రతిభ, సృజనాత్మకత బయటపడిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రదర్శనలను పరిగి MLAతో కలిసి పరిశీలించిన కలెక్టర్, ఆవిష్కరణాత్మక ప్రాజెక్టులపై ఆసక్తి చూపారు. సైన్స్ ఫేర్ శాస్త్రీయ దృష్టిని పెంపొందించడానికి కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.