VZM: మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్యను VSP మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇక్కడ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నగరాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. కాగా కొత్త కమిషనర్గా ఎవరిని నియమిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.