BHPL: మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో సర్పంచ్ యర ముకుందం, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి సోమవారం ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిధిలో గౌడ కాలనీ నుంచి కొయ్యకుంట రోడ్డు చెట్లు పెరిగి మూసుకుపోవడంతో ఆ పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామస్తులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని అన్నారు.