ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియాను JNU శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టిరియా యాంటీ బయాటిక్స్‌కు సైతం లొంగటం లేదని పరిశోధకులు చెప్పారు. ఢిల్లీలోని మురికివాడలు, రద్దీ ప్రాంతాల్లో దీనిని గుర్తించినట్లు తెలిపారు. WHO పరిమితి కంటే 16 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది న్యుమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందన్నారు.