NLR: ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ర్యాలీని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించే పోస్టర్లను మంత్రి ఆనం ఆవిష్కరించారు. ‘మనకోసం, మన కుటుంబం కోసం, మన తోటి వారి కోసం’ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మనందరి బాధ్యత అని తెలియజేశారు.