AP: భోగాపురం ఎయిర్పోర్టు సీఎం చంద్రబాబు దత్తపుత్రిక అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పేరు రాదని మాజీ సీఎం జగన్ రెండోసారి ఫౌండేషన్ వేశారని తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టి భూములు ఇవ్వొద్దని చెప్పారని.. ఎర్రబస్సు రాని చోటుకు ఎయిర్పోర్టు ఎందుకన్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.