సత్యసాయి: అమరావతి – బెంగళూరు జాతీయ ఆర్థిక కారిడార్ (NH-544G) నిర్మాణ పనులను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సోమవారం ప్రారంభించారు. పుట్టపర్తి మండలం సాధార్లపల్లి నుంచి ముదిగుబ్బ మండలం మొలకలవేముల వరకు నిరంతరాయంగా ఈ పనులు సాగనున్నాయి. 153 కిలోమీటర్ల మేర 6 లైన్ల రహదారి పనులను ఈ నెల 11 లోపు పూర్తి చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.