తిరుపతి: పరకామణి చోరీ కేసులో మరో FIR నమోదు అంశంపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు పరిశీలించాలని CID, ACBలకు హైకోర్టు సూచించింది. గత విచారణలో TTDలో AI వాడుకలోకి తీసుకురావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు దానిపై అధ్యయనం చేసి, సలహాలు, సూచనలు ఇవ్వాలని TTDని కోరింది. దీనిపై TTD నివేదిక అందజేయగా పరిశీలిస్తామన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.