SDPT: బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ నాగరణి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు బాలామృతం, గుడ్లు పంపిణీ చేయడంతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.