MBNR: జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ నుంచి మర్లు కాలనీకి వెళ్లే దారిలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ దుర్వినియోగం అవుతోందని, ప్రజాధనం వృథా అవుతోందని కాలనీవాసులు మండిపడుతున్నారు. విధులను సక్రమంగా నిర్వర్తించడంలో అధికారులు విఫలమయ్యా రని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.