WGL: నల్లబెల్లి(M)కేంద్రంలోని ముచింపుల GP కార్యాలయంలో బుధవారం రైతులకు యూరియా ఎరువు కోసం టోకెన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇస్తారీ శేఖర్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో అధికారుల సమన్వయంతో రైతులకు యూరియా సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎలాంటి అధైర్యపడవద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో AO రజిత పాల్గొన్నారు.