మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోఖుల్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల-శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల సందర్శనార్థం 2 రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఆయన.. సతీసమేతంగా కలియుగ దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో వేదపండితులు, అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం పలకగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.