SRCL: సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో వేములవాడలో మంగళవారం 14 సంచార జాతి కులాల సమ్మేళనం నిర్వహించారు. అఖిల భారత సమరసత విభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. విద్య ద్వారానే సంచార జాతుల్లో సరైన జీవన విధానం అలవడుతుందని అన్నారు. సంచార జాతులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారికి దుప్పట్లు పంపిణీ చేశారు.